కోటంరెడ్డి ఒంటిరిగా పర్యటన
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు;

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. ఒక్కడే ఒంటరిగా స్కూటర్ పై హెల్మెట్ ధరించి నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈరోజు ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనుల ఆకస్మిక పర్యటనలో భాగంగా ఒక్కడే ఒంటరిగా హెల్మెట్ ధరించి పార్టీ సీనియర్ నేత షంషుద్దీన్ తో కలిసి 21వ డివిజన్ లో ఆకస్మికంగా పర్యటించారు.
21వ డివిజన్ లో...
21వ డివిజన్ లో ప్రారంభమైన అభివృద్ధి పనుల స్థితిగతులను నేరుగా స్థానిక ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి వారినే అడిగి తెలుసుకున్నారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకుకొని రావాలని,పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే నేరుగా తనకే ఫోన్ చేయాలని అని స్థానిక ప్రజలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మే 20వ తేదికి పనులు పూర్తికావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.