అన్నా క్యాంటిన్ కు కోటి రూపాయల విరాళం
ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే రంగారావు తీమణి డాక్టర్ శాంతారావు ‘అన్న క్యాంటీన్’కు కోటి రూపాయల విరాళంగా అందజేశారు;

ప్రముఖ పారిశ్రామిక వేత్త నార్నే రంగారావు తీమణి డాక్టర్ శాంతారావు ‘అన్న క్యాంటీన్’కు కోటి రూపాయల విరాళంగా అందజేశారు. అనారోగ్యం కారణంగా చనిపోవడానికి ఒకరోజు ముందు రూ. 1 కోటి విరాళం అందించే విషయాన్ని నార్నే రంగారావు చెప్పారంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. పేదలకు మంచి భోజనం అందించడమే లక్ష్యంతో ఏర్పాటయిన అన్నా క్యాంటిన్లకు తమ వంతుసాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
చంద్రబాబును కలసి...
నార్నే రంగారావు మరణానంతరం తన కుమార్తె, నార్నె ఎస్టేట్స్ డైరెక్టర్ అడుసుమిల్లి దీప, వైట్ ఫీల్డ్ బయో ఎండీ అడుసుమిల్లి నరేష్ కుమార్‌తో కలిసి వచ్చి శాంతారావు ఈ విరాళాన్ని సీఈవో నార్నె గోకుల్ తోడ్పాటుతో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలనే ఆలోచనకు... ఇలాంటి వారి మంచి మనసు ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి ఈ విరాళాన్ని అందచేశారు.