అధికారులకు డెడ్ లైన్ విధించిన చంద్రబాబు

ఆర్థిక సంవత్సరం 31వ తేదీతో ముగుస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు;

Update: 2025-03-23 02:47 GMT
chandrababu, chief minister , reveew,  financial  department
  • whatsapp icon

ఆర్థిక సంవత్సరం ఈ నెల 31వ తేదీతో ముగియనుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిధుల కొరతతో కునారిల్లుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తీసుకు రావడంపై దృష్టి పెట్టాలనిఅధికారులను ఆదేశించారు.. వారం రోజుల్లో మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో రావాల్సిన నిధులు తేవాలంటూ అంటూ అధికారులకు చంద్రబాబు డెడ్ లైన్ విధించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి....
కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐదు శాఖల నిధులు పెండింగ్‌లో ఉండటంతో, కేంద్రంతో తక్షణమే సంప్రదింపులు జరపాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో, రాబోయే ఆర్థిక సంవత్సర ప్రణాళికలపై కూడా చర్చించారు. ఆర్థిక గండం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయన్నది చూడాలి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో అధికారులను అప్రమత్తం చేశారు.


Tags:    

Similar News