Posani Krishna Murali : పోసానికి షాకిచ్చిన సీఐడీ పోలీసులు
సినీనటుడు పోసాని కృష్ణమురళి విడుదలకు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి;

సినీనటుడు పోసాని కృష్ణమురళి విడుదలకు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయనపై నమోదయిన కేసుల్లో బెయిల్ రావడంతో ఈరోజు పోసాని కృష్ణమురళి విడుదలవుతారని భావించారు. కానీ పోసానిపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ చేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు చేరకున్నారు. పీటీ వారెంట్ పై పోసాని కృష్ణమురళిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చనున్నారు.
సీఐడీ పీటీ వారెంట్ తో...
జైలునుంచే వర్చువల్ గా పోసానిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశముంది. ఆయనకు దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో ఆయన తరుపున న్యాయవాదులు పత్రాలు తీసుకుని జైలు వద్దకు వెళ్లారు. పోసాని కృష్ణమురళి ప్రస్తుతం కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. సీఐడీ పీటీ వారెంట్ తో పోసాని విడుదల నిలిచిపోయింది.