నేడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ పై?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి.

Update: 2023-10-17 03:02 GMT

chandrababu

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో తుది వాదనలు జరగనున్నాయి. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో హైకోర్టు క్వాష్ పిటీషన్ కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 17 ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా తనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు ఈ పిటీషన్ వేశారు. దీనిపై సుదీర్ఘంగా సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు జరిగాయి.

ఈరోజు వాదనలు...
నేటి మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి తమ వాదనలను జరగనున్నాయి. చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరుపున ముకుల్ రోహిత్గీ తమ వాదనలను వినిపించనున్నారు. ఈరోజు సాయంత్రానికి వాదనలు ముగిసే అవకాశముందని చెబుతున్నారు. దీనిపై తీర్పు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు, క్యాడర్ ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే తమ అధినేత జైలు నుంచి బయటకు వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే 38 రోజుల నుంచి చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News