ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది;

Update: 2024-07-21 11:53 GMT
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి
  • whatsapp icon

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 1,309క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు...
ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది. 7,96,686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు ప్రకాశం బ్యారేజీని ముంచెత్తుతున్నాయి.


Tags:    

Similar News