Srisailam Project : నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు... పది గేట్లు ఎత్తి?
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరుతుంది
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరుతుంది. దీంతో శ్రీశైలంలోని పది గేట్లను అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు నీరు విడుదలవుతుంది. స్పిల్ వే ద్వారా 3.17 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలయింది. అలాగే జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3.42 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.
పూర్తి స్థాయి నీటిమట్టం...
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరుకుంది. గరిష్ట నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా, ప్రస్తుతం నీటి నిల్వ 212.9197 టీఎంసీలుగా నమోదయింది. శ్రీశైలం కుడి, ఎడం జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి మొదలయింది. సాగర్ ప్రాజెక్టకు 60 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాసేపట్లో చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుని జలహారతిని చేపడతారు.