కర్మ ఎవరినీ వదలి పెట్టదు జగన్

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు

Update: 2024-06-18 06:48 GMT

మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ లో టిడిపి నేత అమర్‌నాధ్ రెడ్డి జగన్ కు ప్రశ్నలు సంధించారు. జగన్ ఇంటి ముందు మీడియా వస్తేనే భరించ లేకపోతున్నారని, చంద్రబాబు ఇంటి మీద డ్రోన్లు ఎగరేసిన సంగతి మరిచావా జగన్ అంటూ ప్రశ్నించారు.

నాడు కూల్చివేసినప్పుడు...
చంద్రబాబు ఇంటి పక్కనున్న ప్రజా వేదికను కూల్చిన సంగతి మరిచావా అని అమర్‌నాధ్ రెడ్డి నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పరదాలు వేసుకుని తిరిగావని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుని భద్రత మధ్య బతుకుతున్నావని ఫైర్ అయ్యారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిలో కూడా కడుపు మండిన పేదలు ఉంటారు గుర్తుంచుకో జగన్ అని హెచ్చరించారు. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదన్నారు.


Tags:    

Similar News