Ambati : జగన్ తిరుమల పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటుందా?
జగన్ తిరుమల పర్యటనలో ఘర్షణ వాతావరణం సృష్టించాలనుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
జగన్ తిరుమల పర్యటనలో ఘర్షణ వాతావరణం సృష్టించాలనుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వైసీపీ నేతలను ముందుగా అరెస్ట్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని అంబటి రాంబాబు అన్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏపీలో ఎప్పుడైనా జరిగిందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము అనుకుంటే ఎవరినైనా స్వామి వారి దర్శనానికి ఆపుతారా? అంటూ నిలదీశారు.
డిక్లరేషన్ వివాదాన్ని...
మొన్నటి వరకూ తిరుమల లడ్డూపై వివాదాన్ని రేపి దాని అనసవరంగా రచ్చ చేశారన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై తమకు అనుకూలురైన అధికారులతో సిట్ ను ఏర్పాటు చేశారన్నారు. గతంలో వైెఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పట్టువస్త్రాలను సమర్పించారని, వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రి హోదాలో అనేక సార్లు స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి డిక్లరేషన్ వివాదాన్ని తలెత్తి ఇబ్బందులు పెడతున్నారని ఆయన అన్నారు.