నేడు పోలీసుల ఎదుటకు కాకాణి
నేడు పోలీసుల విచారణకు మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది.;

kakani govarthan reddy
నేడు పోలీసుల విచారణకు మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. నిన్న అందుబాటులో లేకపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఇటీవల కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కోసం పిలిచారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు నమోదయింది.
అక్రమ మైనింగ్ కేసులో...
అక్రమ మైనింగ్ కేసులో నేడు విచారించడానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. అయితే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. లేకుంటే న్యాయస్థానాన్నిఆశ్రయిస్తారా? అన్నది కూడా తేలలేదు. అందుబాటులో లేరన్న వార్తలతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందంటున్నారు.