బస్టాండ్ కట్టలేని వాళ్లు..రాజధాని కడతారట
రాయలసీమకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు
రాయలసీమకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. కేవలం కర్నూలులో ర్యాలీలు చేసినంత మాత్రాన న్యాయ రాజధాని వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో పెద్దలను న్యాయ రాజధాని కోసం డిమాండ్ చేయాలని ఆయన చెప్పారు. అంతమంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయక ఇక్కడ ర్యాలీలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
విధ్వేషాలను రెచ్చగొట్టేందుకే...
ప్రాంతాల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టేందుకే ర్యాలీలు చేస్తున్నారన్నారు. ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలనుకుంటున్నారని కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. పులివెందులలో కనీనసం బస్టాండ్ కూడా నిర్మించలేదని జగన్ న్యాయరాజధాని నిర్మాణం ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాయలసీమలో జరుగుతున్న ఉద్యమం కృత్రిమమేనని, ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదన్నారు.