Kodali Nani comments on Chandrababu: చంద్రబాబు ఎవరి కాళ్లైనా పట్టుకుంటారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు;
Kodali Nani comments on Chandrababu:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం గాడిద కాళ్లు అయినా పట్టుకుంటారని అన్నారు. చంద్రబాబుకు అధికారం కావాలని, అందితే జుత్తు లేకుంటే కాళ్లు పట్టుకున్నారన్నారు. మొదట పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకుని, తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మూడు రోజులు పడిగాపుల కాసి కాళ్లు పట్టుకుని పొత్తులు కుదుర్చుకున్నారన్నారు. మైనారిటీలను తప్పు దోవ పట్టించేందుకే తాను రాష్ట్ర అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నానని చెబుతున్నారన్నారు.
అధికారం కోసం...
ముస్లిం, క్రైస్థవులు అందరికీ ఈ విషయం తెలుసునని, ఆ ఓట్ల కోసమే తమతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అడిగిందని అబద్ధాలు ఆడుతున్నారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు మెంటాలిటీ అందరికీ తెలిసిందేనని కొడాలి నాని అన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక చంద్రబాబు పొత్తులతో అబద్ధాలు చెప్పి గెలవాలని అనుకుంటున్నారని, కానీ ఈ రాష్ట్ర ప్రజలు జగన్ ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలని డిసైడ్ అయ్యారని కొడాలి నాని మీడియా ఎదుట వ్యాఖ్యానించారు.