నేడు జనసేనలో చేరనున్న మాజీమంత్రి
మాజీ మంత్రి పడాల అరుణ ఈ రోజు జనసేన పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జనసేన అధినేత;
మాజీ మంత్రి పడాల అరుణ ఈ రోజు జనసేన పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన ఆమె.. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో రీఎంట్రీకై ఇటీవల ఆమె తన అనుచరనగణంతో భేటీ అయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ రోజు ప్రారంభమయ్యే వారాహి యాత్రలో ఆమె జనసేన కండువా కప్పునేందుకు సిద్ధమయ్యారు.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి పడాల అరుణ మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో టీడీపీ నుంచి చివరిసారి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021లో టీడీపీకి రాజీనామా చేశారు.
పవన్‌తో భేటీ అనంతరం అరుణ మాట్లాడుతూ.. తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరంగా భావించి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యువతకు మేలు చేసే పవన్ ఆలోచనలు, నిర్ణయాలు తనకు నచ్చాయని పేర్కొన్నారు. 10న విశాఖలో జరగనున్న వారాహి యాత్రలో పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు.