మరో నేత వైసీపీ నుంచి సస్పెన్షన్

మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది.;

Update: 2022-10-19 04:33 GMT

మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. పామర్రు నియోకవర్గం నుంచి ఫిర్యాదులు రావడంతో దీనిపై విచారించి వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లారు.

తనకు సమాచారం...
జగన్ అనుమతితో డివై దాస్ ను సస్పెండ్ చేసినట్లు పార్టీ తెలిపింది. అయితే తనను సస్పెండ్ చేసిన విషయం తన దృష్టికి రాలేదని డీవై దాస్ తెలిపారు. తనకు సమాచారం కూడా ఇంకా అందలేదని ఆయన చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డీవై దాస్ ఎమ్మెల్యేగా పామర్రు నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన తర్వాత టీడీపీ అనంతరం వైసీపీలో చేరారు.


Tags:    

Similar News