నేడు హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ విచారణ

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.;

Update: 2024-06-06 04:29 GMT

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈరోజు ఆయన ముందస్తు బెయిల్ విచారణకు వస్తుండటంతో ఆయన తప్పించుకుని పోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మఫ్టీలో ఆయన మకాం వేచి ఉన్న ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు.

ముందస్తు బెయిల్...
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 5వ తేదీ వరకూ అరెస్ట్ చేేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం జరిగిన కేసుతో పాటు మరో మూడు హత్యాయత్నం కేసులున్నాయి. మరి నేడు కోర్టు తీర్పు ఎలా ఉండనుందన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News