Indrakiladri : నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నేడు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు
విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నేడు లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎరుపు లేదా పసుపు రంగు లేదా ఎరుపు రంగుతో పూజలతో పూజించాలని చెబుతుంటారు. నేడు అమ్మవారికి పులిహోర లేదా బూరెలు, కేసరి ప్రసాదంగా పెట్టాలని సూచిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నాలుగో రోజు శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మాంగల్యసౌభాగ్యాన్ని ప్రసాదించే మాతగా కొలుస్తారు. నేడు లలితా స్త్రోత్ర పారాయణం చదివితే మంచిదని చెబుతారు.
సకల ఐశ్వర్యాలను....
సకల ఐశ్వర్యాలను సిద్ధించే రూపంగా లలితా త్రిపురసుందరీ దేవి వరాలిస్తుందంటారు. విజయవాడలో భక్తుల సందడి ఉదయం నుంచే ప్రారంభమయింది. ఉదయం నుంచే క్యూ లైన్లలో భక్తులు చేరడంతో దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలను అధికారులు తీసుకుంటుననారు.