YS JAGAN: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గుడ్ న్యూస్
ఐదేళ్లకు పొడిగిస్తూ బుధవారం తీర్పు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ కు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పాస్ పోర్ట్ రెన్యూవల్ విషయంలో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన పాస్ పోర్టును రెన్యూవల్ చేయాలని, ఐదేళ్లకు పొడిగిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఏపీలో అధికారం కోల్పోయాక జగన్ కు ఉన్న డిప్లొమాటిక్ పాస్ పోర్ట్ రద్దయింది. దీంతో జనరల్ పాస్ పోర్ట్ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఐదేళ్ల జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు ఆదేశించగా, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్ పోర్ట్ కాలపరిమితిని ఏడాదికి కుదించడంతో పాటు పలు షరతులు విధించింది. దీనిపై జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఐదేళ్ల గడువుతో జగన్ కు పాస్ పోర్ట్ జారీ చేయాలని తీర్పు చెప్పింది.
నేడు వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను వైఎస్ జగన్ పరామర్శించారు. గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.