అది జగన్ ఒక్కడికే సాధ్యం

వైసీపీ ప్రభుత్వం ప్రజాసేవకే పునరింకతమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు;

Update: 2022-01-01 08:55 GMT

వైసీపీ ప్రభుత్వం ప్రజాసేవకే పునరింకతమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే వెసులుబాటుగా పనిచేశారన్నారు. తర్వాత కరోనా కారణంగా అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. ఎలాంటి వనరులు లేకుండా విడిపోయిన ఏపీ కరోనా కారణంగా మరింత ఇబ్బంది పడిందన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన రుణభారాన్ని మోస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి వచ్చిదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా ప్రభుత్వం హామీల అమలు విషయంలో వెనక్కు చూడలేదని అన్నారు.

ప్రతి కుటుంబానికి....
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్డి చేకూర్చేలా సంక్షేమ పథకాలను అమలు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఒకవేళ పథకం అందకపోతే ఎటువంటి టైమ్ లిమిట్ లేకుండా వారిని ఎప్పుడైనా లబ్దిదారులుగా చేర్చే ప్రక్రియను జగన్ ప్రారంభించారన్నారు. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని తెలిపారు.


Tags:    

Similar News