ఫిట్ మెంట్ లో మార్పు ఉండదు
ఫిట్ మెంట్ 23 శాతంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఫిట్ మెంట్ 23 శాతంలో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగుల ప్రస్తుతం చేస్తున్న డిమాండ్లపై ఆర్థిక భారం ఎంత పడుతుందన్నది లెక్కలు తీస్తున్నామని చెప్పారు. కేవలం హెచ్ఆర్ఏ శ్లాబులతోనే ప్రభుత్వంపై ఏడు వేల కోట్ల రూపాయల భారం పడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. హెచ్ఆర్ఏ పాత శ్లాబులనే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని చెప్పారు.
ఇవాళ క్లారిటీ.....
సీసీఏ రద్దును చేయాలని కూడా ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. హెచ్ఆర్ఏ కనీసం 12 శాతం ఉండాలని వారు కోరుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సానుకూలంగానే నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.