అమరావతి నిర్మాణానికి నిధులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది. రాజధాని నిర్మాణానికి 1329.21 కోట్లు నిధులు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 800 కోట్ల నిధులతో రాజధాని అమరావతి నిర్మాణం చేపడతామని చెప్పింి. ఇక క్యాపిటల్ రీజయన్ లో సామజిక భద్రత కోసం 121 కోట్లను కేటాయించింది. ఇక ఏటా రాజధాని రైతులకు ఇచ్చే కౌలు కోసం 208 కోట్ల కేటాయింపులు జరిపింది.
మూడు నెలల్లో....
ఇటీవల హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. మూడు నెలల్లో భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించాల్సి ఉంది. ప్లాట్ల అభివృద్ధి కోసం ఈ నిధులను ప్రభుత్వం వెచ్చించనుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయించడంపై రాజధాని ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.