Andhra Pradesh : కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు
ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సదస్సు నిర్వహించే విషయంలో తేదీని ప్రభుత్వం మార్పు చేసింది
ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల సదస్సు నిర్వహించే విషయంలో తేదీని ప్రభుత్వం మార్పు చేసింది. వాస్తవానికి రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగాల్సి ఉంది. అయితే 10, 11 తేదీలకు బదులుగా ఈ నెల 11, 12 తేదీలలో కలెక్టర్ల సదస్సు జరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆరు నెలలు కావస్తున్న సందర్భంగా...
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు. ఒకరోజు కలెక్టర్లతో సమావేశమై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తారు. మరుసటి రోజు జిల్లా ఎస్పీలతో సమావేశమై శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించనున్నారు. 11,12 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందించింది. అమరావతి లోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర జిల్లా నియోజకవర్గస్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.