పీఆర్సీపై కసరత్తు.. క్రిస్మస్ తర్వాతనేనట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది

Update: 2021-12-21 01:59 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. పీఆర్సీ పై స్పష్టత వచ్చేందుకు మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశముంది. ప్రభుత్వోద్యోగులకు డీఏ విడుదల చేసిన ప్రభుత్వం పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామని చెబుతోంది. మరోసారి ఉద్యోగసంఘాలతో చర్చించిన తర్వాతనే పీఆర్సీని ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

వరస కార్యక్రమాలతో....
ఈరోజు జగన్ పుట్టిన రోజు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ పర్యటించనున్నారు. రేపు జగన్ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కర్నూలు వెళ్లనున్నారు. తర్వాత క్రిస్మస్ పండగ కోసం జగన్ కడప జిల్లా టూర్ కు వెళతారు. దీంతో పీఆర్సీపై క్రిస్మస్ తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈరోజు మాత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం తరుపున చర్చలు జరపనున్నారు.


Tags:    

Similar News