పండగ తర్వాత జగన్ ఇలా షాకిచ్చాడే?

సంక్రాంతి పండగ తర్వాత ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. హెచ్ఆర్ఏలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2022-01-18 02:31 GMT

సంక్రాంతి పండగ తర్వాత ఉద్యోగులకు ప్రభుత్వం షాకిచ్చింది. హెచ్ఆర్ఏలో కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30శాతం నంచి 16 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.

హెచ్ఆర్ఏ ఇలా...
నేటి వరకూ జిల్లా కేంద్రాలు, నగర పాలకసంస్థల్లో 20 శాతం, మున్సిపాలిటీల్లో 14.5 శాతం, మిగిలిన చోట 12 శాతం హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం నిర్ణయించిన విధానం మేరకు యాభై లక్షల జనాభా ఉన్న నగరాల్లో 24 శాతం, ఐదు లక్షల వరకూ జనాభా ఉన్న చోట 16 శాతం, ఐదు లక్షలకు తగ్గితే 8 శాతం హెచ్ఆర్ఏను ఫిక్స్ చేశారు. ఏపీలో 24 శాతం హెచ్ఆర్ఏ ఏ ఉద్యోగి అందుకునే అవకాశం లేదు. ఎందుకంటే యాభై లక్షల జనాభాకు మించిన ప్రాంతం లేదు. దీంతో సచివాలయం, హెచ్ఓడీ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News