ఏపీ వాహనాలకు కొత్త సిరీస్

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2023-04-06 04:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. AP 40G సిరీస్‌లో ఇక ప్రభుత్వ వాహనాలను రిజస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ వివిధ సిరీస్ లలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ వాహనాలకు ఇకపై ఒక కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది. తమిళనాడు తరహాలోనే ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొత్త వాహనాలకు మాత్రమే...
ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయని అధికారులు తెలిపారు.. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. దీంతోపాటు ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. వీటి స్ధానంలో కొత్త సిరీస్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు.


Tags:    

Similar News