అర్ధాంతరంగా ముగిసిన చర్చలు

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగశాయి. ఆరున్నర గంటల పాటు జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు

Update: 2021-12-15 15:11 GMT

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగశాయి. ఆరున్నర గంటల పాటు జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో మరోసారి రేపు సమావేశం కావాలని నిర్ణయించాయి. ఉద్యోగ సంఘాలు 46 శాతం ఫిట్ మెంట్ ను అడుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం సానుకూలంగా లేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు.

రేపు మరోసారి....
దాదాపు ఆరు గంటల పాటు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. 46 శాతం ఫిట్ మెంట్ కాకుండా మరో అంకెను చెప్పాలని బుగ్గన, సజ్జల ఉద్యోగ సంఘాలను కోరారు. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. ప్రభుత్వం పై ఆర్థిక భారం ఎక్కువవుతుందని భావించిన బుగ్గన, సజ్జలలు రేపు మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించాయి. ఆ తర్వాతనే ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతారు.


Tags:    

Similar News