తిరుపతి నుంచే పోటీ చేయడం ఖాయం
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తిరుపతి నుంచి పోటీచేస్తానని తెలిపారు
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధినాయకత్వానికి అండగా ఉన్నానని గుర్తు చేశారు. తిరుపతి ఎంపీగా పోటీ చేసినప్పుడు పార్టీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించానని, ఎన్నడూ పార్టీ లైన్ గీత దాట లేదని వరప్రసాద్ తెలిపారు. కానీ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు.
ఏ పార్టీ నుంచి అనేది...
ప్రత్యేక హోదా కోసం జగన్ నాడు రాజీనామా చేయమంటే చేశానని కూడా అన్నారు. కానీ తనకు గూడూరు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదని అడిగినా సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే తాను వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. పవన్ ఆహ్వానం మేరకే మంగళగిరి వెళ్లి కలిశానని కూడా తెలిపారు. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానో త్వరలో ప్రకటిస్తానని వరప్రసాద్ తెలిపారు.