వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చెపట్టిందా....!!??

2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమిని చవి చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీలో

Update: 2024-09-14 10:49 GMT

2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమిని చవి చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీలో తన బలం 151 మంది ఎమ్మెల్యేల నుండి 11 మంది ఎమ్మెల్యేలకి పడిపోయింది..!!!

ఈ పరిస్థితి నుండి పార్టీ కోలుకోక ముందే..,ఇటీవల భారీగా పార్టీ ఫిరాయింపులు అధికార కూటమి ప్రభుత్వం వైపుగా కానసాగుతున్నాయి...!!

ఈ పార్టీ ఫిరాయింపుదారులు కొంత మంది టీడిపి లోకి, మరికొంతమంది జనసేన లోకి, మిగిలిన వారు బీజేపీ లోకి తమ వలసలను కొనసాగిస్తున్నారు..!!

ఈ వలసల జాబితాలో పార్టీ కి చెందిన సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, రాజ్యసభ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పోరేటర్లు ఇలా....అన్ని విభాగాలకు చెందిన నాయకులు ఉన్నారు. ఇక ఎమ్మెల్సీల విషయానికొస్తే....పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి,కర్రి పద్మశ్రీ ఇటీవలే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..!!

అలాగే రాజ్యసభ సభ్యులు అయినా...బీద మస్తాన్ రావు,మోపీదేవి వెంకటరమణ కూడా.. తమ తమ పార్టీ పదవులకు రాజీనామా చేసి, అలాగే రాజ్యసభ లో తమ పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ, వాటికి కూడా రాజీనామా చేసి, రాజీనామా పత్రాలను స్పీకర్ కి అందించడం జరిగింది.ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం పార్టీకి కొత్త ఇమేజ్ తీసుకుని వచ్చే నాయకులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే పార్టీ కి సంబంధించిన వివిధ విభాగాల్లో కొత్త వ్యక్తులను నాయకులుగా నియమించేందుకు కసరత్తు చేస్తోంది...!! రాష్ట్ర అధికార ప్రతినిధి విభాగంలో ఏకంగా నలుగురిని నియమించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు..!!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా...

* జూపూడి ప్రభాకరరావు

* మాజీ మంత్రి,నగరీ మాజీ ఎమ్మెల్యే రోజా

* మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

*సినీనటి ,బుల్లితెర కి చెందిన యాంకర్ శ్యామల

ఈ నలుగురిని పార్టీ అధిష్టానం రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించింది..!!

అయితే ఇందులో యాంకర్ శ్యామలది ప్రత్యేక స్థానంగా చెప్పుకోవచ్చు..!! ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పార్టీ తరపున విసృతంగా ప్రచారం చేసి, పార్టీ ఓటమి పాలైన అనంతరం.. కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు , ఆఖరికి సినిమా పరిశ్రమలో తోటి నటులకు కూడా ట్రోల్ మెటీరియల్ అయింది....ఒకానొక సందర్భంలో..ఆ ట్రోల్ ధాటికి తట్టుకోలేక...""తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా..ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా...తనని క్షమించాలని...రాజకీయాలతో పర్సనల్ విషయాలు ముడిపెట్టి ట్రోల్ చేయడం భావ్యం కాదని, భయాన్ని వ్యక్తం చేస్తూ..ఒక వీడియో రీలీజ్ చేసే వరకూ ఆ ట్రోల్ వెళ్ళింది "" అంటే అర్థం చేసుకోవచ్చు..!!

Tags:    

Similar News