Chandrababu : నేడు బెయిల్ పిటీషన్ విచారణ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది

Update: 2023-10-30 05:38 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పై నేడు పిటీషన్లు విచారణకు రానున్నాయి. బెయిల్ పిటీషన్లపై జస్టిస్ టి. మల్లికార్జున రావు బెంచ్ విచారణ చేపట్టనుంది. క్వాష్ పిటీషన్ బెంచ్ కూడా మారింది.

సుప్రీంలో తీర్పు...
క్వాష్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో తీర్పు రానుంది. స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి యాభై రోజులు గడుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని ఆయన తరుపున న్యాయవాదులు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు బయటకు రావాలని పార్టీ నేతలు ప్రార్థనలు జరుపుతున్నారు.


Tags:    

Similar News