Nara Lokesh : నారా లోకేష్ అరెస్ట్‌పై నేడు విచారణ

టీడీపీ జాాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది;

Update: 2024-02-21 06:15 GMT
nara lokesh, red book, cid, acb court
  • whatsapp icon

టీడీపీ జాాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది. రెడ్ బుక్ పేరుతో అధికారులను నారా లోకేష్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, నారా లోకేష్ 41 ఎ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ తన పిటీషన్ లో పేర్కొంది.

రెడ్ బుక్ లో....
తన వద్ద ఉన్న రెడ్‌బుక్ లో కొందరు అధికారుల పేర్లు ఉన్నాయని, తాము అధికారంలోకి రాగానే వారిపై చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చేస్తున్న హెచ్చరికలు అధికారులను బెదిరించే విధంగా ఉననాయని తెలిపింది. దీనిపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరించనున్నదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News