Ys Jagan : 24న జగన్ బెయిల్ రద్దుపై విచారణ
సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనిపై విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ పదేళ్ల నుంచి బెయిల్ పై ఉంటున్నారని, కేసుల విచారణ వేగవంతంగా జరగడం లేదని ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
శుక్రవారానికి వాయిదా...
తెలంగాణ హైకోర్టును కొట్టవేయడంతో రఘురామ కృష్ణరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటీషన్ ను శుక్రవారం విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ పిటీషన్ పై విచారణ చేయనుంది.