గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్: తెలంగాణకు బదిలీ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Update: 2023-01-16 06:23 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు గంగిరెడ్డికి మంజూరైన బెయిల్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింి. ట్రయిల్ కోర్టు ఇచ్చిన బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలిపింది. వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో బెయిల్ రద్దు చేసే అంశాన్ని కూడా అదే కోర్టు విచారించాలని తెలిపింది.

అన్ని పరిశీలించిన తర్వాత...
కేసులోని మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరోసారి విచారణ జరపాలని, డిఫాల్ట్ బెయిల్ పొందిన వ్యక్తి విచారణకు సహకరించని పక్షంలో బెయిల్ ను రద్దు చేసే అవకాశముంటుంది. బెయిల్ రద్దు పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత బెయిల్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.


Tags:    

Similar News