ఆ రెండు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
జావాద్ తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది.
జావాద్ తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక సూచనలను చేసింది. ఆస్తి, ప్రాణ నష్టం తగ్గించేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరింది. తుపాను తీరం తాకే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరింది.
అన్నీ సిద్ధంగా...
ప్రధానంగా నిత్యావసర వస్తువులు, మందులు, మంచినీటిని ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచింది. దెబ్బతిన్న విద్యుత్తు, రహదారులను పునరుద్ధరించేందుకు సంబంధిత శాఖల సిబ్బందిని రెడీగా ఉంచుకోవాలని కోరింది. ప్రజలు తుపాను తీరం తాకే సమయంలో ఎవరూ బయటకు రావద్దని, అవసరమైతేనే రావాలని వారికి అవగాహన కల్పించాలని కోరింది. ఎన్డీఆర్ఎఫ్ నేతల సేవలను వినియోగించుకోవాలని కోరింది.