రఘురామకు మళ్లీ ఎదురుదెబ్బ

సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది

Update: 2022-10-29 03:46 GMT

ఆస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు ఈ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు బెయిల్ రద్దుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారనడానికి సరైన ఆధారాలు పిటీషనర్ పొందుపర్చలేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు చెప్పారు.

జగన్ బెయిల్ రద్దుపై...
గత ఏడాది సెప్టంబరు 15న ఇదే విషయంపై సీబీఐ కోర్టు తీర్పు చెప్పిందని, అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. బెయిల్ రద్దు చేయడానికి కారణాలు ఏవీ కన్పించడం లేదని న్యాయస్థానం తెలిపింది. ప్రలోభాలకు గురైన సాక్షుల వివరాలు వెల్లడించలేదని పేర్కొంది. సహ నిందితులకు కీలక పదవులు ఇవ్వడం బెయిల్ రద్దుకు సరైన కారణం కాదని అభిప్రాయపడింది.


Tags:    

Similar News