మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్

అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది;

Update: 2022-09-14 12:14 GMT

అమరావతి అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి ఉందని నారాయణ తరుపున న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు కింద కోర్టు రిమాండ్ తిరస్కరించిందని ఆయన పేర్కొన్నారు.

ప్రధాన నిందితుడంటూ...
అమరావతి అసైన్డ్ భూముల కేసులో నారాయణ ప్రధాన నిందితుడని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. ఎస్సీ, ఎస్టీ కేసు కాబట్టి బెయిల్ ఇవ్వవద్దని ఆయన కోరారు. అయితే మరో కేసులో నారాయణకు ముందస్తు బెయిల్ వచ్చిందని, అమెరికా వెళ్లేందుకు కూడా అనుమతి వచ్చిందని నారాయణ తరుపున న్యాయవాది కోర్టుకు వివరించారు. దీంతో నారాయణకు మూడు నెలల ముందస్తు బెయిల్ లభించింది.


Tags:    

Similar News