రైతుల పాదయాత్రకు రిస్ట్రిక్షన్స్... హైకోర్టు ఆదేశం
అమరావతి రైతుల మహా పాదయాత్రపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
అమరావతి రైతుల మహా పాదయాత్రపై హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రైతుల పాదయాత్రకు మద్దతు తెలిపే వారు యాత్రలో పాల్గొనకూడదని పేర్కొంది. మద్దతు, సంఘీభావం చెప్ప దలచుకుంటే రోడ్డు కిరువైపులా నిల్చుని మద్దతు తెలపవచ్చని తెలిపింది. అంతే తప్ప పాదయాత్రలో మాత్రం రైతులు తప్ప ఇతరులు పాల్గొనకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఆరు వందలు మాత్రమే రైతులు పాదాయత్ర చేయాలని స్పష్టం చేసింది.
పోలీసులూ సహకరించాలి....
అలాగే ప్రభుత్వం కూడా రైతుల పాదయాత్రకు అన్ని రకాలుగా సహకరించాలని తెలిపింది. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పాదయాత్ర ప్రశాంతంగా సాగేలా చూడాలని కోరింది. పాదయాత్రను రద్దు చేయాలన్న ప్రభుత్వం తరుపున వేసిన పిటీషన్ పై విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే ప్రకటనలను కూడా తాము వింటామని న్యాయస్థానం తెలిపింది.