నారాయణ కేసులో తీర్పు రిజర్వ్

మాజీ మంత్రి నారాయణ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.;

Update: 2022-11-29 08:11 GMT

మాజీ మంత్రి నారాయణ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణను విచారించ వచ్చని చిత్తూరు కోర్టు తీర్పు చెప్పింది. ఈ నెల 30న లొంగిపోవాలని చిత్తూరు హైకోర్టు నారాయణను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు నారాయణను విచారణ చేయడానికి సిద్దమయ్యారు.

తదుపరి ఉత్తర్వులు ...
అయితే నారాయణ చిత్తూరు కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ నారాయణ బెయిల్ రద్దు కేసులో హైకోర్టు ఇరువర్గాల వాదనను వినింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. తీర్పును రిజర్వ్ చేసింది.


Tags:    

Similar News