నారాయణపై లుక్ అవుట్ నోటీసులపై హైకోర్టు?

మాజీ మంత్రి నారాయణపై ఉన్న లుకౌట్ నోటీసుపై హైకోర్టు స్పందించింది.;

Update: 2022-09-20 12:46 GMT

మాజీ మంత్రి నారాయణపై ఉన్న లుకౌట్ నోటీసుపై హైకోర్టు స్పందించింది. తనపై ఉన్న లుక్ అవుట్ నోటీసును ఎత్తివేయాలంటూ నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. అమెరికా వెళ్లేందుకు అనుమతించినా లుక్ అవుట్ నోటీసు ఉన్న కారణంగా వెళ్లేందుకు వీలుపడటం లేదని నారాయణ తరుపున న్యాయవాదులు వాదించారు.

తొలగించాంటూ....
లుక్ అవుట్ నోటీస్ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ కు చిత్తూరు జిల్లా ఎస్పీ లేఖ రాసినందున అమెరికా వెళ్లేందుకు వీలుపడటం లేదని తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు నారాయణపై లుక్ అవుట్ నోటీసును తొలగించాలని ఆదేశించింది. నారాయణ ఈ ఏడాది డిసెంబరు 22వ తేదీలోగా అమెరికా నుంచి తిరిగి రావాలని కోరింది.


Tags:    

Similar News