ఏపీలో నేడు చేతులు మారనున్న కోట్ల రూపాయలు

బెట్టింగ్.. కాదేదీ బెట్టింగ్ కు అనర్హం అని ఊరికే అంటారా చెప్పండి

Update: 2023-12-03 03:19 GMT

బెట్టింగ్.. కాదేదీ బెట్టింగ్ కు అనర్హం అని ఊరికే అంటారా చెప్పండి. ఈరోజు ఏపీలో భారీగా డబ్బులు చేతులు మారనున్నాయి. ఇంతకూ ఈ బెట్టింగ్ కు కారణం ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్ అనుకుంటూ ఉన్నారేమో!! అదేదీ కాదు. అంతకంటే ముందు మొదలయ్యే తెలంగాణ ఎన్నికల కౌంటింగ్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ ఉండడంతో భారీ ఎత్తున ఏపీలో బెట్టింగ్ జరుగుతూ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో గెలిచే వ్యక్తులకు సంబంధించి మాత్రమే కాకుండా.. పలు ప్రముఖ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారా అనే విషయంలో భారీ బెట్టింగ్ లు సాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్‌ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖచ్చితంగా హ్యాట్రిక్‌ కొడుతుందని కొందరు ఆ పార్టీ మీద బెట్టింగ్ వేశారు. కాంగ్రెస్‌ సంచలనం సృష్టిస్తుందని మరికొందరు పందెం వేశారు.

తెలంగాణలో 49 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. అభ్యర్థులు కూడా లెక్కింపు కేంద్రాలకు చేరుకుంటున్నారు. 8.30 గంటల నుంచి ఈవీఎంలను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన వెంటనే ఈవీఎంలను భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమును తెరిచి కంట్రోల్ యూనిట్లకు టేబుల్‌కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని ‘టోటల్’ బటన్ నొక్కగానే ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుస్తుంది. అనంతరం ‘రిజల్ట్’ బటన్‌పై ఒత్తగానే ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో కనిపిస్తుంది.


Tags:    

Similar News