అనంతపురంలోని హైవేను దిగ్బంధించిన టమోటా రైతులు
అనంతపురంలో టమాటా రైతులు జాతీయ రహదారిపై కూర్చుని ఆందోళనకు దిగారు. దీంతో హైవైపై ట్రాఫిక్ స్థంభించిపోయింది
అనంతపురంలో టమాటా రైతులు జాతీయ రహదారిపై కూర్చుని ఆందోళనకు దిగారు. మండీ అసోసియేషన్ పేరుతో వ్యాపారస్తులపై రౌడీయిజం చేయడాన్నినిరిస్తూ టమాటారైతులు ఈ ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-బెంగళూరు హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లారీ, మండీ అసోసియేషన్ల పేరుతో వేధిస్తున్నారని రైతులు, వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు.
లారీలు మార్కెట్ లోకి రాకుండా...
వ్యాపారస్తుల లారీలు మార్కెట్లోకి రాకుండా లారీ అసోసియేషన్ నిర్వాహకులు బెదిరింపులు దిగుతున్నారని టమాటా రైతులు ఆరోపిస్తున్నారు. అడిగినంత డబ్బు ఇస్తేనే బయ్యర్లను మండీల్లోకి అనుమతిస్తున్నారని రైతులు చెబుతున్నారు. హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులతో చర్చలు జరుపుతున్నారు.