Andhra Pradesh : పింఛన్ల పంపిణీ ప్రారంభం... ఏపీలో మొదలయిన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది

Update: 2024-08-01 02:24 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమయింది. ఆగస్టు 1వ తేదీ కావడంతో ఉదయం నుంచి రాష్ట్రంలో పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ కావడంతో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కొక్కరికి పెంచిన విధంగా నాలుగు వేల రూపాయల చొప్పున పింఛనును నేడు పంపిణీ చేస్తున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు...
పింఛన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కోసం 2,737 కోట్ల ను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న 64.82 లక్షల మందికి ఈరోజు ఉదయం నుంచి పింఛన్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. పింఛన్ల పంపిణీని రేపటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మరొక రోజు తీసుకోవాలని, అంతే తప్ప పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మడకశిరలో....
ప్రభుత్వం వృద్ధులకు ఎన్టీఆర్ ఆసరా పింఛను కింద నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలోని గుండుమలలో ఈరోజు మధ్యాహ్నం లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛనును అందచేయనున్నారు. నేడ శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పూజలు కూడా నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మడకశిర వెళ్లనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


Tags:    

Similar News