ఏపీలో పోలీసులు తనిఖీలు..నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే
ఆంధ్రప్రదేశ్ లో వాహనాలకు సంబంధించి పోలీసులు తనిఖీలు నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ లో వాహనాలకు సంబంధించి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు నెంబర్ ఫ్లేటు లేకుండా రోడ్లపై నడిపితే ఎవరిని ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. గత మూడు రోజుల నంుచి వాహనాలకు నెంబర్‌ప్లేటు లేకుండా రోడ్లపై నడుతున్నా వారిని పట్టుకునేందుకు పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
మద్యం తాగి నడిపితే...
గుంటూరు అర్బన్ మినహా ప్రతి చోటా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొన్ని వాహనాలు సీజ్ చేశారు. యజమానులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి నెంబర్ ప్లేటు బిగింపజేసి వాహనాలను వారికి అప్పగించారు. అనంతరం పోలీసులు మట్లాడుతూ మైనార్లు డ్రైవ్ చేసినా, లైసెన్సు లేకుండా రోడ్లపైకి వాహనాలు వచ్చినా అక్కడికక్కడే పట్టుకుని సీజ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎవరికైనా సరే మూడు నెలల జైలు శిక్ష తప్పదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.