YSRCP : ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవం?

ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2024-02-15 03:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి సుముఖత చూపడం లేదన్న వార్తతో వైసీపీ నుంచి నామినేషన్లు వేసిన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.

ఎన్నికల సమయంలో...
ఎన్నికల సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం, అందుకు సమయం కేటాయించడం అనవసరమని భావించిన చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడంతో వైసీపీ నుంచి నామినేషన్లు వేసిన మేడా శివనాధ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారులు ఈ మేరకు ప్రకటన చేయనున్నారు. నేడు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు.



Tags:    

Similar News