YSRCP : నేడు వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతుంది.;
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతుంది. రైతులకు జరుగుతున్న అన్యాయం పోరు జరపాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రైతులకు ఇరవై వేల రూపాయల సాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలను చేయనుంది. ప్రతి జిల్లాకేంద్రంలో వైసీపీ శ్రేణులు ధర్నా చేయడంతో పాటు కలెక్టర్లకు వినతి పత్రాలను సమర్పించనున్నారు.
ఇవే డిమాండ్లు...
ధర్నా జరిగే ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీలను నిర్వహించాలని జగన్ పిలుపు నిచ్చారు. ధాన్యానికి కనీస మద్దతు ధరను ప్రకటించాలని, పండిన ధాన్యాన్ని మొత్తాన్నికొనుగోలు చేయాలని, దళారీ వ్యవస్థను అరికట్టి రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. దీంతో పాటు ఉచిత బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కూడా వైసీపీడిమాండ్ చేస్తుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు రాజకీయ ప్రతినిధులందరూ పాల్గొనాలని వైసీపీ అధినేత జగన్ పిలుపు నిచ్చారు.