YSRCP : కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ కుదుపు.. కీలక నేత కుటుంబం?
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి;
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ నేత సైకం అర్జునరావు వర్గం తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా, దివిసీమలో మత్స్యకారులకు పెద్ద దిక్కుగా వ్యవహరించిన సైకం అర్జునరావు మరణానంతరం వైసీపీలో ఆయన కుటుంబం కీలకంగా వ్యవహరిస్తుంది.
మత్స్యకారులకు...
ఎదురుమొండి వారధి సాధనలో వైఫల్యం, మత్సకారుల అనేక సంక్షేమ పథకాలు రద్దు కావడంతో అసంతృప్తిగా ఉన్న సైకం వర్గీయులు..తెలుగుదేశం పార్టీతోనే మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతతో ఇప్పటికై సైకం కుటుంబీకులు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది.