స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఈడీ దూకుడు
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు 23 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు
స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు 23 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. సీమెన్స్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ అధికారులు నిర్ణయం తీసుకుంది. 2014లో స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ జరిగిందని మొన్నటి వైసీపీ ప్రభుత్వం విచారణకు సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో అప్పట్లో చంద్రబాబు నాయుడు అరెస్టయి 53 రోజులు జైలులో కూడా ఉన్నారు.
ఆస్తులను అటాచ్ చేసి...
అయితే సీఐడీ దర్యాప్తును అనుసరించి నిధులు వ్యక్తిగత ఖాతాల్లోకి దారి మళ్లింపు జరిగిందని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు గుర్తించారు. దీంతో ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ వేగం పెంచిందని దీనిని బట్ట ి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇంకా ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.