మూడో ఎమ్మెల్సీ కూడా టీడీపీదే
పశ్చిమ రాయలసీమలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,453 ఓట్ల తేడాతో గెలుపొందారు.
తెలుగుదేశం పార్టీ ఖాతాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు పడిపోయాయి. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయం సాదించింది. పశ్చిమ రాయలసీమలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 7,453 ఓట్ల తేడాతో గెలుపొందారు. 16వ తేదీన ప్రారంభమయిన పోలింగ్ ఈరోజు సాయంత్రం వరకూ సాగింది. నిన్నటి వరకూ స్వల్ప ఆధిక్యంలో ఉన్న వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి రెండో ప్రాధాన్యత క్రమంలో జరిగిన లెక్కింపులో వెనకపడి పోయారు.
రెండో ప్రాధన్యత క్రమంలో...
బీజేపీ, పీడీఎఫ్ ఓట్లు రెండో ప్రాధాన్యత ఓటు టీడీపీకే పడటంతో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ గెలిచినట్లయింది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఇంతవరకూ డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదు.