నేడు విశాఖలో మిలాన్
భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్ 2024 విన్యాసాలు నేడు ప్రారంభం కానున్నాయి
భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిలాన్ 2024 విన్యాసాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు విశాఖపట్నంలో సిటీ పరేడ్ ను నిర్వహించనున్నారు. ఆర్కే బీచ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌లు హాజరు కానున్నారు. నావికాదళం విన్యాసాలను తిలకించేందుకు నేడు లక్షల సంఖ్యలో జనం రానున్నారు. తొలి విమాన వాహక నౌక ఐేఎస్ విక్రాంత్ విశాఖపట్నం తొలిసారి రానుంది. విశాఖలోనే మరో వాహన యుద్ధనౌక విక్రమాదిత్య రానున్నారు.
భారీ భద్రతను...
ఈ వేడుకను చూసేందుకు విశాఖ నుంచే కాదు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈరోజున విశాఖలో సిటీ పరేడ్ జరగనుంది. రేపటి నుంచి 27వ తేదీ వరకూ మిలాన్ సీ ఫేజ్ విన్యాసాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సిటీ పరేడ్ లో వివిధ దేశాలు పాల్గొననున్నాయి. తమ జాతీయ జెండాలతో ఈ పరేడ్ లో పాల్గొంటాయి. ఈ కార్కక్రమానికి వీవీఐపీలు వస్తుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖలో ఈరోజు జరిగే మిలన్ వేడుకలను చూసేందుకు రాష్ట్రం నలమూలల నుంచి అనేక మంది ప్రజలు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు.