కాకినాడ తీరంలో భారీ పరిశ్రమ.. 5000 మందికి ఉద్యోగాలు

కాకినాడ తీరంలో భారీ పరిశ్రమ సిద్ధమవుతూ ఉంది. కాకినాడ అరబిందో సెజ్ లో

Update: 2023-12-20 02:42 GMT

aurobindopharma in AP

కాకినాడ తీరంలో భారీ పరిశ్రమ సిద్ధమవుతూ ఉంది. కాకినాడ అరబిందో సెజ్ లో అరబిందో అనుబంధ సంస్థ లైఫియస్ ఫార్మా రూ. 2 వేల కోట్లతో భారీ పరిశ్రమ నిర్మిస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. లైఫియస్ ఫార్మా ఇండస్ట్రీ పెన్సిలిన్- జి ఉత్పత్తి చేయడానికి రూ.2 వేల కోట్లతో కాకినాడలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.. ఇక్కడ మొక్కజొన్న నుంచి పెన్సిలిన్ -జి కి అవసరమైన ఔషధ ముడి పదార్థం తయారు చేస్తారు. 2024 చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా 410 ఎకరాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే 5000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

పెన్సిలిన్‌–జి, 7–అమైనోసెఫలోస్పోరానిక్‌ యాసిడ్‌ (7–ఏసీఏ) తయారీకై లైఫియస్‌ ఫార్మా ద్వారా అరబిందో ఫార్మా దరఖాస్తు చేసింది. 15,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో పెన్సిలిన్‌–జి ప్లాంటుతో పాటు.. 2,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో 7–ఏసీఏ యూనిట్‌ ఇక్కడ స్థాపించనున్నారు. కాకినాడ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ భారీ పరిశ్రమలు ఉపాధిని అందించనున్నాయి.


Tags:    

Similar News