13 మంది ఏపీ మంత్రులకు వార్నింగ్

13మంది మంత్రులకు ఇంటలిజెన్స్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అర్జీలు ఇచ్చే రూపంలో వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది;

Update: 2022-10-23 06:42 GMT
twitter account,ycp, hacked
  • whatsapp icon

ఏపీలో 13 మంది మంత్రులకు ఇంటలిజెన్స్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అర్జీలు ఇచ్చే రూపంలో వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. టెక్కలిలో జనసేన కార్యాలయంపై జరిగిన దాడికి నిరసగా ప్రతి దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ శాఖ నివేదికలు వెల్లడించాయి.

ఖండించిన జనసేన....
అయితే దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. జనసేనపై దుష్ప్రచారం చేయడానికి ఇంటలిజెన్స్ ను వాడుకుంటుందని తెలిపింది. జనసేన కార్యాలయంలపైనే వైసీపీ నేతలు దాడులు చేశారన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తు చేసింది. ఇంటలిజెన్స్ శాఖ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందని జనసేన నేతలు తెలిపారు.


Tags:    

Similar News