ఇప్పటం.. ఆ సానుభూతి మాకు అవసరం లేదు
ఇప్పటం గ్రామం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. గ్రామంలో ఇప్పుడు వెలిసిన ఫ్లెక్సీలు మరో కొత్త వివాదానికి దారి తీశాయి.
ఇప్పటం గ్రామం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. గ్రామంలో ఇప్పుడు వెలిసిన ఫ్లెక్సీలు మరో కొత్త వివాదానికి దారి తీశాయి. "ప్రభుత్వం మా ఇల్లు ఏమీ కూల్చలేదని, మీ ఎవ్వరీ సానుభూతి మాకు అనవసరం లేదని, డబ్బులిచ్చి అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించవద్దు" అంటూ కొన్ని ఇళ్ల ముందు ఫ్లెక్సీలు వెలిశాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటనల తర్వాత ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.
ఇంటి ముందు ఫ్లెక్సీలు...
ఇప్పటంలో రహదారి విస్తరణ కోసం కొన్ని ఇళ్లకు సంబంధించిన ప్రహరీ గోడలను అధికారులు కూల్చివేశారు. గ్రామంలో స్కూలు బస్సులు వచ్చిపోయేందుకు విస్తరణ చేపట్టాలని గ్రామస్థులే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కోరారని చెబుతున్నారు. అయితే తమ సభకు భూమిని ఇచ్చారని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇళ్లను కూల్చివేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూల్చిన ఇంటికి లక్ష రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించారు. లోకేష్ కూడా పర్యటించి గ్రామంలో బాధితులను పరామర్శించారు. ఈనేపథ్యంలో వెలసిన ఫ్లెక్సీలు మరో వివాదానికి దారితీశాయి